కాకినాడకు చెందిన వి.ఎస్.ఎన్ నిర్మాణ రంగం సంస్థ, సోమవారం టీటీడీ శ్రీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం చెక్ రూపంలో అందించింది. తిరుపతిలోని టీటీడీ ఈవో కార్యాలయంలో ఈవో ముద్దాడ రవిచంద్రకు సంస్థ ప్రతినిధులు ఈ చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో వి.ఎస్.ఎన్. కంట్రక్షన్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ ఆర్.ఎస్. శాంతారామ్, ప్రతినిధులు దుర్గా కామాక్షి, జాస్తి శ్రీనివాస రావు పాల్గొన్నారు.