తిరుపతి: ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ. 2. 50 కోట్లు విరాళం

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్, టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ. 2.50 కోట్ల విరాళం అందించింది. బుధవారం తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఫౌండేషన్ ట్రస్టీ అనురాగ్ చౌదరి, టీటీడీ ఛైర్మన్ బి. ఆర్. నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ నిధులతో పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వీలవుతుందని ఛైర్మన్ తెలిపారు. దాతృత్వాన్ని ఛైర్మన్ అభినందించారు.

సంబంధిత పోస్ట్