శుక్రవారం, టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు రూ. 10 లక్షలు, శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు మరో రూ. 10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన రైడాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో వంగల హర్షవర్ధన్ శ్రీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ. 10 లక్షల డీడీని, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ డైరెక్టర్ నేలబొట్ల శుభ సౌజన్య శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ. 10 లక్షల విరాళాన్ని టీటీడీ చైర్మన్‌కు అందజేశారు.