హైదరాబాద్‌కు చెందిన భక్తుడు పి. శ్రీకాంత్ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. 25 లక్షలు విరాళంగా శుక్రవారం అందించారు. తిరుమలలోని అదనపు ఈఓ కార్యాలయంలో ఈ విరాళాన్ని టీటీడీ అదనపు ఈఓ సి. హచ్. వెంకయ్య చౌదరికి అందజేశారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి సేవలో భాగంగా ఈ దాతృత్వం చేయడం ఆనందంగా ఉందని శ్రీకాంత్ తెలిపారు.