తిరుపతి: గంగమ్మకి సారె సమర్పించిన శాప్ చైర్మన్ రవి నాయుడు

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరలో శాప్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అనిమిని రవి నాయుడు దంపతులు గురువారం అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, వేద పండితులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రవి నాయుడు మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్