తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లి లే అవుట్ డెవలప్మెంట్ పనులు పూర్తయ్యాయని, అర్హులైన లబ్ధిదారులను ఈ నెల 15న ముఖ్యమంత్రి లాటరీ విధానంలో ఎంపిక చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్లాటుదారులకు రెండు సెంట్లకు తగ్గకుండా ప్లాట్లు కేటాయిస్తామని, రిజిస్ట్రేషన్ ఫీజు పూర్తిగా మినహాయింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శెట్టిపల్లిని ఆధునిక మౌలిక వసతులతో మోడల్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు.