తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన బుధవారం ఉదయం, శ్రీగోవిందరాజ స్వామివారు మోహిని అవతారంలో పల్లకిపై విహరించి భక్తులను ఆశీర్వదించారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ పల్లకీ ఉత్సవం భక్తి పారవశ్యంతో సాగింది. గోవింద నామస్మరణలతో మారుమోగిన మాడవీధుల్లో భక్తులు స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుని, అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించారు.