శుక్రవారం రాత్రి తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కలకలం సృష్టించాడు. ఏకాంత సేవ తర్వాత భద్రతా సిబ్బందిని తప్పించుకుని ఆలయ గోపురంపైకి ఎక్కి, 90ఎంఎల్ మద్యం ఇస్తేనే దిగుతానని షరతు పెట్టాడు. పోలీసులు మూడు గంటల పాటు శ్రమించి నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు.