తిరుపతి: వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఊంజల్ మండపానికి తీసుకువచ్చి, నరసింహతీర్థం నుండి తెచ్చిన పవిత్ర జలాలతో శ్రీ కోదండరామునికి అభిషేకం నిర్వహించారు. యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశస్నపన తిరుమంజనం అనంతరం రాత్రి పట్టాభిషేక కార్యక్రమం వైభవంగా ముగిసింది.

సంబంధిత పోస్ట్