తిరుపతి: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర పాల్గొన్నారు. అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన వంటి అనేక క్రతువులను నిర్వహించారు. అనంతరం మాంగళ్యధారణ, హోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల తలంబ్రాల సమర్పణ, మాలమార్పిడి, హారతి, వేద పారాయణం, యజమానికి వేద ఆశీర్వాదం వంటి కార్యక్రమాలు జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్