తిరుపతి: జర్నలిస్టు హత్య నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలి

వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి తీవ్రంగా ఖండించారు. నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టును కిరాతకంగా హత్య చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమని తెలిపారు. జర్నలిస్టుల రక్షణకు చట్టాలను మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్