తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్య రక్షణ కోసం ఈ-సైకిళ్ల వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ, ఈ-సైకిళ్ల వాడకం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి, ఇంధన వ్యయం ఆదా అవుతుందని తెలిపారు. భావితరాలకు పరిశుభ్రమైన వాతావరణం అందించడానికి వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గించి, ఈ-సైకిళ్లను ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలని సూచించారు.