రాజమండ్రిలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ (అండర్-13) ఫుట్ బాల్ టోర్నమెంట్లో తిరుపతి జిల్లా జట్టు మూడవ స్థానంలో నిలిచి ప్రదర్శనతో ఆకట్టుకుంది. నెల్లూరులో జరిగిన జోనల్ పోటీల్లో విజేతగా నిలిచిన తిరుపతి జట్టు, రాష్ట్రస్థాయిలో విశాఖ, కాకినాడలను ఓడించి సెమీఫైనల్‌కి చేరింది. అనంతరం కడపను ఓడించి మూడవ స్థానాన్ని సంపాదించింది. కోచ్‌లు వినోద్, రమేష్, డీ ఎఫ్ ఏకార్యదర్శి రెడ్డప్ప కృషి అభినందనీయమన్నారు.