తిరుపతి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు

టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు శుక్రవారం తిరుపతిలో సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి క్షేత్రం ఆధ్యాత్మికంగా వాటికన్ సిటీని కూడా దాటిందని, అందుకే కొందరు క్రిస్టియన్లు ఈ పవిత్ర క్షేత్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించారని, కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అలాగే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి విచారణకు సహకరించకుండా కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్