తిరుపతి: టిటిడి ఎస్వీ గోశాలకు ఎండుగడ్డి విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, తన కుటుంబసభ్యులతో కలిసి కాకినాడ నుండి 8 లారీల ఎండుగడ్డిని టీటీడీ ఎస్వీ గోశాలకు బుధవారం విరాళంగా అందించారు. మూగజీవులకు ఆహారం అందించాలనే సంకల్పంతో శ్రీనివాస సేవా ట్రస్ట్, జ్యోతుల నెహ్రూ ట్రస్ట్ ద్వారా ఈ పశుగ్రాసాన్ని ఉచితంగా అందజేసినట్లు ఆయన తెలిపారు. ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏ. వి. ఎన్. శివకుమార్ ఈ విరాళాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్