తిరుపతి: టీటీడీ, దేవాదాయ శాఖ సమన్వయ సమావేశం

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు, ఈవో జె. శ్యామలరావు, దేవాదాయశాఖ కార్యదర్శి వినయ్ చంద్ కలిసి దేవాదాయశాఖ, టీటీడీ మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలపై శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కామన్ గుడ్ ఫండ్ నిధుల విడుదల, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయాల వివరాలు, ఆలయాల పునరుద్ధరణ పరిరక్షణ, వాటి పురోగతి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సంబంధిత పోస్ట్