తిరుమల శ్రీవారి సేవ స్వచ్చంద వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణలపై టీటీడీ ఈవో జే. శ్యామలరావు, అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా త్వరలో ప్రారంభించనున్న ప్రొఫెషనల్ శ్రీవారి సేవ, ఎన్ఆర్ఐ సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల కార్యాచరణ పురోగతి గురించి సుదీర్ఘoగా చర్చించారు.