తిరుపతి: ఎస్వీ బాలమందిరాన్ని పరిశీలించిన టిటిడి జేఈవో

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ బాలమందిరాన్ని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ గురువారం అధికారులతో కలిసి సందర్శించారు. అనాథ పిల్లల జీవితాల్లో బాలమందిరం ఆశాకిరణంగా నిలుస్తోందని ఆయన అన్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, టీటీడీ అందిస్తున్న నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, వసతి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు. విద్య, వైద్యం, ఆహార సదుపాయాలపై ఏవైనా లోపాలున్నాయా అని ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్