తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం (ఏడీ బిల్డింగ్) సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 30 ఏళ్ల వయసున్న మృతుడు చెక్స్ షర్ట్, వాకింగ్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించకపోవడంతో, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్సై ప్రసాద్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.