తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో వందేభారత్ రైలుకు ప్రమాదం తప్పింది. సోమవారం స్టెబ్లింగ్ యార్డులో నిలిపిన ఓ రైలు జనరల్ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో వందేభారత్ రైలు ఫ్లాట్ ఫార్మ్‌కు రానుంది. అయితే మంటలను గమనించిన వందేభారత్ సిబ్బంది అప్రమత్తమై రైలును సమీప దూరంలోనే నిలిపారు. తద్వారా పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.