శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వినూత కోట ను జనసేన పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ లు తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే నివాసంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చెన్నైలో వినూతపై హత్యా నేర అభియోగం నమోదు కావడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు వారు చెప్పారు.