మార్చి 9న టీటీడీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం మహిళా ఉద్యోగుల కోసం వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తోంది. ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు జరిగాయి. చిత్రలేఖనంలో పీఆర్వో (ఎఫ్ఏసి) కుమారి పి. నీలిమ ప్రథమ, శశికళ ద్వితీయ, కుమారి ఇంద్రజ తృతీయ స్థానాల్లో నిలిచారు.