మహిళాభ్యుదయానికి దారిచూపిన మహాకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాలు బుధవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన శతావధాని ఆముదాల మురళి, వెంగమాంబ శ్రీవారిపై అచంచలమైన భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసాలను తన రచనల ద్వారా ప్రతిబింబించారని కొనియాడారు. "మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – ద్విపద భాగవతం" అనే అంశంపై ఆయన ప్రసంగించారు.