తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్కీడిప్ టోకెన్లు ఉన్న భక్తుల దర్శనం నేటితో ముగుస్తుంది. TTD సర్వదర్శనం క్యూలైన్ ఏర్పాట్లు పూర్తిచేశాయి. ఆక్టోపస్ సర్కిల్ నుండి లైన్ ప్రారంభం కానుంది. రద్దీ స్థితిని బట్టి సాయంత్రం నుండి టోకెన్లున్నవారిని క్యూలోకి తీసుకోవడం మొదలవ్వచ్చు. రాత్రి నుంచి సర్వదర్శనం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.