టీటీడీ సెప్టెంబర్ దర్శన టికెట్ల విడుదల షెడ్యూల్ ప్రకటన

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల టికెట్ల విడుదల షెడ్యూల్‌ను ప్రకటించింది. జూన్ 18న ఆర్జిత సేవల టికెట్లు, 22న కల్యాణోత్సవం వంటి సేవల టికెట్లు, 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు, ప్రత్యేక ఉచిత దర్శన టోకెన్లు, 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ (https://ttdevasthanams.ap.gov.in) ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్