తిరుపతిలో స్టార్టప్‌తో యువతకు దారి చూపిన ఉష

అధిక వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలి, తిరుపతి కేంద్రంగా ‘జెన్ జీ రథన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇంక్యుబేటర్’ (RTIH) స్టార్టప్‌ను స్థాపించిన ఉష, యువతకు స్ఫూర్తిగా నిలిచారు. తిరుపతిలో జరిగిన కూటమి సభలో ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణుల వినూత్న ఆలోచనలకు RTIH అండగా నిలుస్తోందని తెలిపారు. తన ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందని, ఇంటర్న్షిప్ కార్యక్రమాల ద్వారా ఏడాదిలోనే 1,500 మంది యూజీ విద్యార్థులకు ఐటీ రంగంలో శిక్షణ అందించామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్