భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో, మంత్రి ఆనం తదితరులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం బేడీ ఆంజనేయస్వామిని కూడా ఆయన దర్శించుకున్నారు.