వాకాడు(M) కొండాపురం దేవరాలకి చెందిన 25 ఏళ్ల యువ రైతు సుబ్బయ్య, పొలం పనుల కోసం ట్రాక్టర్‌కు రోటవేటర్‌ను తగిలిస్తుండగా ప్రమాదవశాత్తు అది బలంగా తగలడంతో మృతి చెందారు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇదివరకే భర్తను కోల్పోయిన తల్లి, ఇప్పుడు ఏకైక కుమారుడిని కూడా కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.