వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, దిత్వా తుఫాను నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని, చెరువు కట్టలు తెగకుండా, ప్రజలకు, రైతులకు నష్టం కలగకుండా చూడాలని ఆదేశించారు. సోమవారం వెంకటగిరి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన తుపాన్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని 219 చెరువుల మరమ్మత్తులకు రూ. 12 కోట్లు మంజూరు చేశామని, అవసరమైతే రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసి ప్రతి చెరువును పటిష్టం చేస్తామని తెలిపారు. తెలుగు గంగ జలాలను సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు అవసరమైన యూరియా, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టించవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.