వెంకటగిరిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కళాశాలలో ప్రవేశానికి ఈనెల 15వ తేదీ వరకు గడువును ప్రిన్సిపల్ శ్రీకాంత్ ప్రభాకర్ పొడిగించారు. పదో తరగతి పరీక్షల్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని, ఇంటర్మీడియట్ (ఎంపీసీ), ఐటిఐ (రెండు సంవత్సరాలు పూర్తయిన వారు) అర్హులని ఆయన తెలిపారు.