మొంధా తుఫాన్ తో నిమ్మ రైతులు కుదేలు, ప్రభుత్వం ఆదుకోవాలని కోరిక

రాపూరు మండలంలో మొంధా తుఫాన్ కారణంగా నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు. మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు నిమ్మ చెట్లు వేళ్ళతో సహా పైకి లేచి, పూత, పిందెలు రాలిపోయాయి. అనేక చెట్లు నేలకొరిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల సాగు నాశనమై, వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్