వెంకటగిరిలో మోహన్ బాబు దిష్టిబొమ్మ దగ్ధం

వెంకటగిరి పట్టణంలోని కాశీపేటలో సీఐటీయూ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సినీ నటుడు మోహన్ బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు చెంగయ్య మాట్లాడుతూ, ఎస్ఎఫ్ఎ నాయకులు అక్బర్, వినోద్‌లపై దాడి చేసి కిడ్నాప్ చేయడం దారుణమని విమర్శించారు. కిడ్నాప్ కేసులో నమోదైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని సీఐటీయూ నాయకులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్