రాపూరు మండలంలోని పెంచలకోనలో శెట్టి వారి సత్రంలో పెంచలకోన ప్రధాన అర్చకులు సీతారామయ్య స్వామి వారి వివాహ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. నూతన వధూవరులను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేసిన పెంచలకోన దేవస్థాన మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, వివాహం జీవితంలో పవిత్రమైన క్షణమని, నూతన దంపతులు పరస్పర ప్రేమ, గౌరవాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.