వెంకటగిరి: అన్నదాత సుఖీభవలో 476 మందికి ఒకరే తండ్రి

బాలాయపల్లి మండలంలోని 44 రెవెన్యూ గ్రామాల్లో 476 మంది అన్నదాత లబ్ధిదారులకు తండ్రి పేరుగా చినవెంకటసుబ్బరాజు అనే ఒకే పేరును చేర్చారు. సాంకేతిక లోపంతో 2వేల మందికి లబ్ధి అడ్డంకి ఏర్పడిందని సోమవారం టీడీపీ నేతలు "సుపరిపాలన తొలి అడుగు"లో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక తహసీల్దారు లాగిన్ అందుబాటులో లేదన్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సరిచేయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్