కొత్త ఏడాది తొలి రోజే సైదాపురం దళిత కాలనీకి చెందిన నాగరాజు అనే నిరుపేద కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందాడు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే నాగరాజు మరణంతో ఆ కుటుంబం ఆధారాన్ని కోల్పోయింది. లోకం తెలియని ముగ్గురు ఆడపిల్లలు తండ్రి మృతదేహం వద్ద దీనస్థితిలో నిలిచిన దృశ్యం అందరినీ కలచివేసింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.