వెంకటగిరి: విధి నిర్వహణలో గుండెపోటుతో అటవీశాఖ ఉద్యోగి మృతి

వెంకటగిరి రేంజ్‌కు చెందిన అటవీశాఖలో వాచర్ గా పనిచేస్తున్న తిరుమలశెట్టి చెంచయ్య గురువారం విధి నిర్వహణలోనే గుండెపోటుకు గురయ్యారు. వెలిగొండ అటవీ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. సహచర సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే చెంచయ్య మృతి చెందారు. అధికారులతో పాటు యూనియన్ నాయకులు, సహచర ఉద్యోగులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్