వెంకటగిరిలో చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. పట్టణంలోని బంగారుపేటలో నేతన్నలతో సమావేశమై పథకాల పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం నేతన్నల ఇళ్లకు వెళ్లి మగ్గాలను పరిశీలించి, పింఛన్లు అందజేశారు. చేనేత మగ్గాలకు 200యూనిట్లు, మరమగ్గాలకు 500యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, నేతన్నల పెన్షన్‌ను రూ. 4వేలుగా ఇస్తున్నామని తెలిపారు.