వెంకటగిరి మండలం వల్లివేడు సమీపంలో ఉన్న 9వ బెటాలియన్ కార్యాలయంలో కమాండెంట్ గా ఈఎస్ఎస్ ప్రసాద్ బాధ్యతలను చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తన కర్తవ్యాన్ని ఎప్పటికీ మర్చిపోనని శుక్రవారం తెలిపారు. విధులతో పాటు అధికారులు, సిబ్బంది సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తానని తెలియజేశారు. కమాండెంట్ ను అధికారులు ఘనంగా సత్కరించారు.