వెంకటగిరి పట్టణం మున్సిపల్ కార్యాలయం నుంచి పురవీధుల్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులకు పెంచిన జీతాలను వెంటనే జీవోను విడుదల చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే మునిసిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.