AP: విజయవాడలోని నున్న పోలీస్ స్టేషన్ సీఐ అహ్మద్ అలీ గుండెపోటుతో మృతి చెెెెెెెెందిన విషయం తెలిసిందే. అలంకార్ ధర్నాచౌక్ సెంటర్లో విధుల్లో ఉండగా సీఐ అహ్మద్ అలీ కుప్పకూలారు. ఆస్పత్రికి తరలిస్తుండగా సీఐ అహ్మద్ అలీ ప్రాణాలు విడిచారు. సీఐ ఆకస్మిక మృతిపై హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అహ్మద్ అలీ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. సీఐ కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని హోంమంత్రి అనిత చెప్పారు.