సతీష్ కుమార్ మృతిచెందిన స్థ‌లాన్ని ప‌రిశీలించిన సీఐడీ చీఫ్

AP: టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిచెందిన ఘటనలో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ దర్యాప్తు చేపట్టారు. గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్తుండగా, తాడిపత్రిలోని కోమలి వద్ద రైలు పట్టాలపై శవమై తేలిన సీఐ సతీష్ కుమార్ మృతి స్థలాన్ని రవిశంకర్ అయ్యన్నార్ పరిశీలించారు. ఈ కేసును గుత్తి నుంచి తాడిపత్రి పీఎస్‌కు బదిలీ చేశారు. అనంతపురం ఎస్పీ జగదీష్, సీఐడీ చీఫ్‌కు కేసు వివరాలను తెలియజేశారు. కాగా, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్