AP: విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో ఇప్పటివరకు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. గత 18 నెలల్లో రాష్ట్రానికి మొత్తం రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. శ్రీసిటీలో 12 కొత్త ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదిరాయని, 12,365 ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. శ్రీసిటిని ప్రపంచ స్థాయి పారిశ్రామిక కేంద్రంగా మార్చే లక్ష్యంతో 6,000 ఎకరాల భూమి కేటాయింపు, 1.5 లక్షల ఉద్యోగాల సృష్టి వంటి ప్రణాళికలను చంద్రబాబు వివరించారు.