ఏపీలో నిర్వహించిన సీఐఐ సమ్మిట్ వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. 2025 సమ్మిట్ పేరుతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలంటూ వస్తున్న ప్రకటనలను ఆయన తప్పుబట్టారు. గతంలో చేసుకున్న ఎంవోయూల్లో ఎన్ని ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అమలయ్యాయో నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ నిధులతో చంద్రబాబు, ఆయన తనయుడు పబ్లిసిటీ కోసం మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అమర్నాథ్ ఆరోపించారు.