AP: విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో పౌర విమాన సేవలు నిలిచిపోవడంపై ఉద్యోగులు కంటతడి పెట్టుకున్నారు. ‘11 ఏళ్ల అనుబంధం ముగిసింది. ఈరోజే ఆఖరి రోజు. ఎన్నో జ్ఞాపకాలు, అనుబంధాలు ఉన్న చోట సేవలు నిలిచిపోవడం బాధగా ఉంది’ అని ఉద్యోగులు అన్నారు. ఎంతో మంది ప్రయాణికులకు సాక్ష్యంగా నిలిచిన విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ఉద్యోగుల భావోద్వేగ వీడ్కోలు పలికారు.