AP: మన్యం జిల్లాలో అర్నాడ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని జనసేన నేతలు నిలదీయడంతో ఈ ఉద్రిక్తత మొదలైంది. ఈ క్రమంలో టీడీపీ నాయకులు జనసేన నేతలపై కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. ఇరువర్గాల మధ్య జరిగిన ఈ వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.