AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, పరస్పర ఆరోపణలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. నామినేషన్ పత్రాలు లాక్కొని చించేయడం, అభ్యర్థులను అడ్డుకోవడం వంటి ఘటనలకు సంబంధించి ఇరు పార్టీలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికార టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తుంటే.. ఓటమి భయంతోనే వైసీపీ డ్రామాలు ఆడుతోందని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. ఈ పరిణామాల్లో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? అనేది పక్కన పెడితే.. ప్రజాస్వామ్యంలో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునే పరిస్థితులు ఉండాలన్నదే కీలకం.