పల్నాడులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని లింగంగుంట్లలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇరువర్గాలు కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. ముఖ్యంగా టీడీపీ నేత బసవేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ గొడవకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్