AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై దాడి ఘటనలో పట్టాభిపురం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో క్లూస్ బృందం గుంటూరులోని అంబటి నివాసం, కార్యాలయంలో ఆధారాలు సేకరించారు. అయితే, దాడికి వినియోగించిన కర్రలు తదితర సామగ్రిని పోలీసులు సీజ్ చేయబోతుండగా.. వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. బుధవారం జగన్ ఇక్కడికి రానున్నారని, ఆయన పర్యటన అనంతరం వాటిని తీసుకెళ్లాలని నాయకులు వాదనకు దిగడంతో పోలీసులు వెనుదిరిగారు.