జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఫైర్

AP: తిరుమల శ్రీవారి పరకామణి చోరీపై జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్కు దేవుడన్నా, భక్తులన్నా, ఆలయాల పవిత్రత అన్నా ఏమాత్రం లెక్క లేదని మండిపడ్డారు. బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తి.. పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని భావించారన్నారు. దీనికంటే ఘోరం మరొకటి ఉంటుందా.. ? అని ప్రశ్నించారు. దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు తిరిగి చెల్లించాడని జగన్ వాదించడం అనైతికమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్