AP: సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మత్స్యకారుల గాలింపు చర్యలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కాగా, మత్స్యకారుల కోసం కోస్ట్‌గార్డ్స్, మెరైన్ పోలీసులతో పాటు రెండు డార్నియర్ విమానాలు, నేవీ బోట్లతో పాటు మరో 7 బోట్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.